రాజకీయం గెలిచింది...ప్రజాస్వామ్యం ఓడింది

July 29, 2019


img

ఈరోజు ఉదయం శాసనసభ సమావేశం కాగానే స్పీకర్ రమేశ్ కుమార్ యడియూరప్ప ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించగా 106 మంది సభ్యులు అనుకూలంగా, 99 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దాంతో యడియూరప్ప బలపరీక్షలో నెగ్గారు. బలపరీక్ష అనంతరం స్పీకర్ రమేశ్ కుమార్ చాలా హుందాగా తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్న ఆయన నిజానికి తన పదవికి రాజీనామా చేయవలసిన అవసరమే లేదు. కానీ రాజీనామా చేయకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తామని సిఎం యడియూరప్ప ముందే హెచ్చరించడంతో అటువంటి పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం తనకు లేదని చెప్పి హుందాగా రాజీనామా చేసి సభలో సభ్యులకు నమస్కరించి తన కుర్చీలో నుంచి దిగి వెళ్ళిపోయారు.  దీంతో కర్ణాటకలో మరోమారు రాజకీయం గెలిచింది...ప్రజాస్వామ్యం ఓడింది.

ఇక నుంచి కాంగ్రెస్‌-జెడిఎస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించి శాసనసభలో తమ బలం పెంచుకునేందుకు యడియూరప్ప, ఆయన ప్రభుత్వంలోని అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ప్రభుత్వం పడగొట్టేందుకు కాంగ్రెస్‌-జెడిఎస్‌లు ముమ్ముర ప్రయత్నాలు ప్రారంభించడం తధ్యం.


Related Post