కర్ణాటకలో మళ్ళీ రాజకీయ కల్లోలం మొదలైనట్లే ఉంది. మాజీ సిఎం సిద్దరామయ్య ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్, బిజెపిలో చేరేందుకు ప్రయత్నించిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌పై అనర్హత వేటు వేశారు. ఆయన 2023 వరకు ఏ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించారు. దీంతో 13 మంది కాంగ్రెస్, ఇద్దరు జెడిఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తే ఏమవుతుందో చెప్పకనే చెప్పారు. కనుక ఇంతకాలం కాంగ్రెస్-జెడిఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వంతో చెలగాటం ఆడిన ఎడ్యూరప్పకు ఇప్పుడు ఆట మొదలైనట్లే ఉంది.