చాంద్రాయణగుట్ట మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లొ చాలా రోజుల పాటు వైద్యచికిత్స చేయించుకొని ఇటీవలే హైదరాబాద్ తిరిగివచ్చారు. నేటికీ ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా మెరుగపడలేదని సమాచారం. ఆ విషయం ఆయనే స్వయంగా దృవీకరించారు కూడా. కనుక సమాజంలోని నిరుపేద ముస్లిం ప్రజలకు తోడ్పడుతూ వారి జీవితాలలో వెలుగులు నింపి మిగిలిన జీవితాన్ని పునీతం చేసుకొనే ప్రయత్నం చేయకుండా యధాప్రకారం ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు.
మంగళవారం రాత్రి కరీంనగర్‌లో ఎంఐఎం వ్యవస్థాపకుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ సంస్మరణ సభకు హాజరైన ముస్లిం ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకప్పుడు ముస్లిం వ్యక్తి కరీంనగర్ మేయరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు కరీంనగర్ ఎంపీ సీటును బిజెపి కైవసం చేసుకొంది. మన అనైక్యత కారణంగానే ఇక్కడ బిజెపి గెలువగలిగింది. మజ్లీస్ పార్టీ ఓడిపోయినా పరువాలేదు కానీ మనం బీజేపీని మాత్రం గెలువనీయకూడదు. ఆనాడు అంటే 2013లో నేను హిందుత్వ పార్టీలను ఉద్దేశ్యించి (ఒక్క 15 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే చాలు దేశంలో హిందూ ముస్లిం జనాభా లెక్కలు సరిసమానం చేస్తాం) అన్న ఆ ఒక్క మాటతో ముస్లిం ప్రజలలో మనోధైర్యం పెరిగిందని నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెపుతున్నాను. ఆనాడు నేను ఆవిధంగా అన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ మూకలు నన్ను ఏమీ చేయలేకపోయాయి. మనం భయపడుతుంటేనే వారు భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే మనం ఐకమత్యంగా ఉంది ఎదురుతిరిగితే వారే మనల్ని చూసి భయపడతారు. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదని డాక్టర్లు చెప్పారు కానీ నేను చనిపోతే వెయ్యి మంది అక్బరుద్దీన్ ఓవైసీలు జన్మిస్తారు. మీ కోసం పోరాడుతూనే ఉంటారు. నేను టైగర్‌ను కాను కానీ మీలో నుంచి టైగర్స్ ను తయారుచేయాలన్నదే నా లక్ష్యం,” అని అన్నారు.