పురపాలక బిల్లుపై గవర్నర్‌ అభ్యంతరాలు

July 23, 2019


img

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం-2019కి రాష్ట్ర శాసనసభ, మండలి ఆమోదముద్ర వేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేస్తే చట్టరూపం దాల్చుతుంది. కానీ ఆయన దానిలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సవరణలు చేశారు. వాటిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆయన సూచించిన మార్పులు చేర్పులతో కూడిన ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. కనుక పురపాలక చట్టం-2019కి గవర్నర్‌ నరసింహన్‌ ఇప్పుడు ఆమోదముద్ర వేయవచ్చు. ఆయన సంతకం చేయగానే దానికి చట్టంగా మారి అమలులోకి వస్తుంది.   

 



Related Post