తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలు

July 18, 2019


img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుదవారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్లుప్తంగా ఆ వివరాలు: 

1. కొత్తగా రూపొందించి పురపాలక ముసాయిదా బిల్లుకు ఆమోదం. 

2. వృద్ధాప్య పింఛను వయోపరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గింపు. 

3. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, భోధకాలు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, బీడీ, గీత, నేత కార్మికులకు ఇప్పటివరకు ఇస్తున్న రూ. 1000 పింఛన్‌ను రూ.2,016కు పెంపు.   

4. దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇస్తున్న రూ.1,500 పింఛన్‌ను రూ.3,016కు పెంపు. 

5. అర్హులైన వారందరికీ పెంచిన పింఛనులు జూన్ నెల నుంచి వర్తింపు. ఈ నెల 20వ తేదీ నుంచి చెల్లింపులు. 

6. బీడీ కార్మికులకు పీఎఫ్ గడువు తేదీ తొలగింపు. బుదవారం వరకు పీఎఫ్ ఖాతాలున్న బీడీ కార్మికులు అందరికీ పింఛను చెల్లించబడతాయి. 

7. ప్రభుత్వాసుపత్రులలో భోధనావైద్యుల వయోపరిమితి పెంపుకు ఆమోదం. 

8. కొత్తగా ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు. అవి హైదరాబాద్‌ నగరాన్ని ఆనుకొని ఉన్న బండ్లగూడ, బోడుప్పల్, ఫీర్జాదీగూడ, బడంగ్ పేట, నిజాంపేట, జవహార్ నగర్‌. అక్కడ నగరపాలక హోదాతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబడతాయి. 

9. రాష్ట్రంలో నగరాలను, పట్టణాలను ఆనుకొని ఉన్న ప్రాంతాలను సమీకృత టౌన్ షిప్స్ గా అభివృద్ధి చేయబడతాయి. ఒక్కోటి 100, 50, 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని మౌలికవసతులతో ఏర్పాటు చేయబడతాయి.    

10. పరోక్ష పద్దతిలో మేయర్, పురపాలక చైర్మన్ల ఎన్నికకు మంత్రిమండలి ఆమోదం. 

11. పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం. 

12. రాష్ట్రంలో మున్సిపల్ వార్డుల సవరణకు ఆమోదం. 

13. జిఎస్టి అమలుకు ఆర్డినెన్స్

14. రైతు రుణవిముక్తి కమీషన్‌లో పలు నిబందనలు మార్పుకు ఆమోదం.


Related Post