చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరే

July 11, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుదవారం డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. పోక్సో చట్టం-2012కు సవరణ చేసింది. ఇది  అమలులోకి వస్తే ఇక నుంచి చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినవారికి ఉరిశిక్ష విధించబడుతుంది. అలాగే చిన్నారులచేత నీలిచిత్రాలలో నటింపజేసేవారికి భారీ జరిమానా, జైలుశిక్ష విధించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. 

సంఘటిత, అసంఘటిత రంగంలో కార్మికులకు మరింత మేలు చేసేందుకుగాను, ఇప్పటి వరకు వేర్వేరు శాఖల క్రింద ఉన్న 13కేంద్రకార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. 10 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ చట్టాన్ని వ్యాపారం, సేవా, ఐ‌ట్‌ రంగాలకు కూడా వర్తింపజేసింది. దీనివలన దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్యరక్షణ లభిస్తాయి.          

ప్రదాని గ్రామ సడక్ యోజన (గ్రామాలలో రోడ్ల నిర్మాణం) మూడో విడత పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో కొత్తగా 1.25 కిమీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. వీటికోసం రూ. 80,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (రైల్వే పోలీస్) సర్వీసులకు గ్రూప్-ఏ హోదా కల్పించింది.


Related Post