బిజెపి వైఖరి మారినందుకే పార్లమెంటులో ఆ సంగతి ప్రస్తావించారా?

July 02, 2019


img

తెరాస నేత కృష్ణారావు మహిళా అటవీశాఖ అధికారిణిపై కర్రతో దాడి చేయడం గురించి రాజ్యసభలో కేంద్ర అటవీశాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రస్తావించడం విశేషం. సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ, “విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా అధికారిణిపై ప్రజాప్రతినిధి దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కటిన చర్యలు చేపడతాము,” అని అన్నారు.

దేశంలో ఇటువంటి సంఘటనలు ఉత్తరాది రాష్ట్రాలలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. బిజెపి పాలిత రాష్ట్రమైన యూపీలో కూడా ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ అప్పుడు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలుపెట్టినా కేంద్రప్రభుత్వం స్పందించదు. కానీ తెలంగాణలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై కేంద్రమంత్రి మరుసటిరోజే పార్లమెంటులో ప్రస్తావించి దీనిని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నా అది తెరాస పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపి వైఖరిలో మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతీ చిన్న విషయంపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించబోతోందని చెప్పకనే చెప్పినట్లు భావించవచ్చు. కనుక తెరాస సర్కార్ మరికొంచెం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమే.


Related Post