ఫిరాయింపులపై విజయశాంతి స్పందన

June 21, 2019


img

ఫిరాయింపుల గురించి కాంగ్రెస్‌ నేత విజయశాంతి చాలా ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చి పోటీ చేయించడం, వారికే ఉన్నత పదవులు ఇవ్వడం వంటి కారణాల వలన వారు తమ వ్యాపార అవసరాల కోసం పార్టీ ఫిరాయించడం సర్వ సాధారణమైపోయింది. కొన్నిసార్లు పార్టీల నిర్ణయాలు కూడా ఫిరాయింపులకు కారణం అవుతున్నాయి. 

తమిళనాడులోని అన్నాడీఎంకె, డీఎంకె పార్టీల మాదిరిగా తెరాస కూడా బలపడాలని సిఎం కేసీఆర్‌ కోరుకోవడం విడ్డూరం ఉంది. ఆ రెండు పార్టీలలో పార్టీ కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతుంటారు కనుక పార్టీలతో బలమైన అనుబందం కలిగి ఉంటారు. ఆ రెండు పార్టీలు రెండు మూడు తరాలుగా అదేవిధానానికి కట్టుబడి ఉండటం వలన అవి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న ఈ గున్నాత్మకమైన రాజకీయ విధానాన్ని అర్ధం చేసుకోకుండా, తమిళనాడు తరహాలో ప్రాంతీయ, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడుకునే విధంగా బలమైన వ్యవస్థను నిర్మించకుండా వాటిలాగ టీఆర్ఎస్ బలోపేతం కావాలను కోవడం అత్యాసే అవుతుంది.     

టిడిపి, టీఆర్ఎస్ రెండూ పెట్టుబడిదారులను, ఫిరాయింపుదారులను నమ్ముకొనడం వలన అటువంటి అవకాశవాద నేతలతో వాటి అస్తిత్వానికి ఎప్పుడూ ముప్పు ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణగా ఏపీలో టిడిపి కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలైపోయి దాని ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చుతున్నాయి. రేపు టీఆర్ఎస్ పార్టీకి కూడా అదే పరిస్థితి ఎదురవవచ్చు. 

ఒక రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే అక్కడ జాతీయపార్టీలు ప్రవేశించడం కష్టమని తమిళనాడులో పార్టీలు నిరూపిస్తుంటే, జాతీయపార్టీలు బలపడి పోరాడితే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయని తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు నిరూపిస్తున్నాయి,” అని అన్నారు. 

పార్టీల పునాదులు బలంగా ఉన్నప్పుడే ఏ పార్టీ అయినా మనుగడ సాగించగలదు. ఫిరాయింపుదారులు, పెట్టుబడిదారులను నమ్ముకొన్న పార్టీలకు ఏనాటికైనా ముప్పు తప్పదన్న విజయశాంతి మాటలు అక్షరసత్యాలే అని అందరికీ తెలుసు.


Related Post