ఏం కాదు ఫికర్ చేయకుండ్రి...

June 21, 2019


img

సుమారు ఐదేళ్ళ క్రితం తెలంగాణ టిడిపిలో నుంచి ఒకరొకరుగా తెరాసలోకి వెళ్ళిపోతుంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, “తెలుగుదేశం పార్టీకి ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటం కొత్తకాదు. అనేకసార్లు ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొని మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడూ అంతే. ఎంతమంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా నష్టం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. వారున్నంత కాలం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. తెలంగాణలో ఎప్పటికైనా మనమే అధికారంలోకి రావడం ఖాయం,” అని పదేపదే చెప్పేవారు. ఆయన ఆవిధంగా చెపుతుండగానే రాష్ట్రంలో టిడిపి క్రమంగా అదృశ్యమైపోయింది. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయలేని స్థితికి దిగజారింది. ఏం కాదు ఫికర్ చేయకుండ్రి...అంటూనే చంద్రబాబునాయుడు తెలంగాణలో టిడిపి దుకాణం మూయించేశారు. 

ఇప్పుడు ఏపీలో కూడా టిడిపికి మళ్ళీ ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవలసి వస్తోంది. గురువారం నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోగానే విదేశాలలో ఉన్న చంద్రబాబునాయుడు అక్కడి నుంచి ఏపీ టిడిపి నేతలకు ఫోన్ చేసి ధైర్యం చెపుతూ మళ్ళీ అవే మాటలు చెప్పారు. వాటిలో ఒకే ఒక పదం మారింది.  ‘తెలంగాణ’ అనే పదం బదులు ‘ఆంధ్రప్రదేశ్’ అని. ఏం కాదు ఫికర్ చేయకుండ్రి...అంటుంటే ఏమనుకోవాలిప్పుడు?


Related Post