భేష్ అది చాలా మంచి ఆలోచనే!

February 03, 2018


img

తెలంగాణా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా 2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ మహాసభలలో తెలంగాణా బాష, సాహిత్యం, కళలు, సంస్కృతీ సంప్రదాయాలను లోకానికి చాటి చెప్పడం జరిగింది. అలాగే వివిధ సాహిత్య, కళా రంగాలలో నిష్ణాతులైనప్పటికీ మరుగునపడిన సాహితీవేత్తలు, కళాకారుల గొప్పదనాన్ని లోకానికి చాటి చెప్పడం జరిగింది. వర్తమాన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తమ విద్వత్ ను చాటి చూపారు.

ఈ మహాసభలలో తెలంగాణా రాష్ట్రం సంపూర్ణంగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. కనుక తెలంగాణా రాష్ట్ర సాహిత్య అకాడమీ ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో జరిగిన విశేషాలన్నిటినీ క్రోడీకరించి పుస్తకరూపంలో ముద్రించడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా తెలంగాణా రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల గురించి ఎవరైనా, ఎప్పుడైనా పూర్తి వివరాలు చదువుకోవచ్చు. ఆ వివరాలన్నీ పుస్తకరూపంలో ఉంటాయి కనుక అది ఎప్పటికీ ఒక రికార్డుగా నిలిచి ఉంటుంది. ఉగాది నాటికి ఈ సంచిక సిద్దం చేయడానికి తెలంగాణా రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంశలు అందుకొన్న అకాడమీ దానిని అక్షరబద్ధం చేసి పుస్తకరూపంలో అందించాలనే ఆలోచన చేయడం నిజంగా చాలా మంచి ఆలోచన. అందుకు అకాడమీ సభ్యులందరికీ అభినందనలు. 


Related Post