నల్లగొండ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో తెరాస నేతల హస్తం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరాసపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఒక రాజకీయ హత్యను సాధారణ కోట్లాట హత్యగా చిత్రీకరించడానికి తెరాస సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో హతుడు శ్రీనివాస్ కాల్ రికార్డ్స్ ను పరిశీలిస్తే తెరవెనుక సూత్రధారులు ఎవరో తేలుతుందని అన్నారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అయన పోలీస్ అధికారులపై, తెరాస సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఈ ఆరోపణల వలన తెరాస సర్కార్ కు అప్రదిష్ట కలుగుతున్నప్పటికీ, తెరాస నేతలు మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఒక ఖండనతో సరిపెట్టేశారు. కానీ నేటికీ కోమటిరెడ్డి సోదరులిద్దరూ తెరాస సర్కార్ పై తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. కనుక పోలీసులు శ్రీనివాస్ హత్య కేసు దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి నిందితులను కోర్టులో హాజరుపరచడం చాలా అవసరం.