మందకృష్ణకు జైలు-బెయిలు..జైలు?

January 23, 2018


img

ఎం.ఆర్.పి.ఎస్. అధినేత మందకృష్ణ మాదిగకు మంగళవారం సిటీ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరికొద్ది సేపటిలో అయన చంచల్ గూడా జైలు నుంచి విడుదలవుతారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న అయనకు నిరాహార దీక్ష చేయడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అయన తన కార్యాలయంలో నిరాహారదీక్ష కూర్చొన్నారు. దానికీ అనుమతి లేదని చెపుతూ జనవరి 2వ తేదీన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. అంతకుముందు ఒకసారి అదే కారణాలతో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు తన పోరాటం ఆపబోనని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. కనుక బయటకు రాగానే అయన మళ్ళీ దీక్షకు ప్రయత్నించవచ్చు అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైలుకు తరలించవచ్చు. అరెస్టులు చేసి తన పోరాటాలను అడ్డుకోలేరని, తన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయలేరని మందకృష్ణ మాదిగ పదేపదే చెపుతున్నారు. 

ఎస్సీ వర్గీకరణ సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాలని మందకృష్ణ మాదిగ అడగడం లేదు. ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళడానికి అఖిలపక్ష సభ్యులను డిల్లీకి తీసుకువెళతానని ముఖ్యమంత్రి కెసిఆర్  శాసనసభలో హామీ ఇచ్చారు. శాసనసభలో ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే మందకృష్ణ మాదిగ కోరుతున్నారు. కానీ దానికీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దపడకపోవడంతో మందకృష్ణ మాదిగ తన నిరసనను తెలియజేస్తున్నారు. కానీ కార్యాలయంలో కూడా దీక్ష చేయడానికి అనుమతి లేదని చెపుతూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కానీ ఇటువంటి చర్యలతో ఆ వర్గపు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నామని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది కదా. 


Related Post