తెరాస సర్కార్ ఆ ఇబ్బందిని ఎలా అధిగమిస్తుందో?

January 05, 2018


img

తెరాస సర్కార్ కు ఊహించని సమస్య ఎదురైంది. ఈ ఏడాది మే నెల నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు సమన్వయ సమితిల ద్వారా ప్రతీ గ్రామంలో గల రైతుల పేర్లు, వారి భూమి, బ్యాంక్ ఖాతాల వివరాల వంటివన్నీ సేకరించి సిద్దంగా పెట్టుకొంది. అయితే ఇక్కడే ఊహించని సమస్య ఎదురైంది. వారికి ఆ డబ్బును అందజేసేందుకు నిధుల కొరత లేదు కానీ వారి ఖాతాలలో దానిని జమా చేసినట్లయితే, ఇంకా చాలా మంది రైతుల పంట రుణాలు తీరలేదు కనుక బ్యాంకులు వెంటనే ఆ డబ్బును తమ వడ్డీ క్రింద జమ చేసుకోవడం ఖాయం. కనుక వారికి ఆ డబ్బును అందజేయడం ఎలా? అని తెరాస సర్కార్ ఆలోచిస్తోంది. ఈ సమస్యపై అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ నేతృత్వంలో ఒక మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజా సమాచారం. ప్రభుత్వం చేతిలో డబ్బున్నా దానిని అర్హులకు అందించడంలో ఇటువంటి ఇబ్బంది ఎదురవడం విచిత్రంగానే ఉంది కదా! తెరాస సర్కార్ ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తుందో చూడాలి.



Related Post