మెట్రో రైల్ ఫస్ట్ మంత్ రిపోర్ట్!

December 29, 2017


img

నేటికి సరిగ్గా నెలరోజుల క్రితమే అంటే నవంబర్ 29 నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల రోజులలో మెట్రో రైల్లో 32.25 లక్షల మంది ప్రయానిన్చారని మెట్రో రైల్ ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ ప్రారంభం కాకమునుపు నుంచి నేటికీ తరచూ అనేక పుకార్లు, విమర్శలు వినబడుతూనే ఉన్నాయని అన్నారు. అనేక సవాళ్ళను ఎదుర్కొని మెట్రో రైల్ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంనందుకు చాలా సంతోషంగా ఉంది. సగటున రోజుకు లక్ష మంది మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారని, మున్ముందు ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ స్మార్ట్ కార్డ్స్ వారే సంఖ్యా కూడా నానాటికీ పెరుగుతోందని అన్నారు. ఈ నెలరోజులలో మొత్తం 1.5 లక్షల స్మార్ట్ కార్డ్స్ అమ్మకం అయ్యాయి. ప్రతీరోజు కొత్తగా 2,000 మంది స్మార్ట్ కార్డ్స్ కొనుగోలు చేస్తున్నారు. 22 శాతం ప్రయాణికులు స్మార్ట్ కార్డ్స్ రోజూ వినియోగిస్తున్నారని ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు.       

ఇక పార్కింగ్ సమస్యల గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “ఒక్క ప్రకాష్ నగర్ స్టేషన్ వద్ద తప్ప మిగిలిన 23 స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశాము. అన్ని స్టేషన్లలో టాయిలెట్స్ ఏర్పాటుకు, వాటి నిర్వహణకు టెండర్లు ఆహ్వానించబోతున్నామని తెలిపారు. త్వరలోనే కంప్యూటరైజ్డ్ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్ సర్వీసులను పెంచడానికి ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడుతున్నామని చెప్పారు. 


Related Post