ధూత-2 వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ షురూ!

June 05, 2026


img

అక్కినేని కుటుంబానికి మరపురాని మధురానుభూతి ఓ చక్కటి ఫ్యామిలీ వీడియో వంటి ‘మనం’ సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు విక్రం కుమార్‌. ఆయన దర్శకత్వంలో నాగ చైతన్య తొలిసారిగా ధూత వెబ్‌ సిరీస్‌ చేస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దాని కొనసాగింపుగా ధూత-2 తీసేందుకు సిద్దమవుతున్నారు. శుక్రవారం అన్నపూర్ణా స్టూడియోలో ధూత-2 పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత అక్కినేని నాగార్జున క్లాప్ కొట్టి లాంచనంగా షూటింగ్‌ ప్రారంభించారు. 

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నాగ చైతన్య ఓ అవినీతిపరుడైన జర్నలిస్ట్ సాగర్ వర్మగా నటించగా ఆయన భార్య ప్రియగా ప్రియ భవానీ శంకర్, క్రాంతి షినోయ్ అనే పోలీస్ అధికారిణిగా పార్వతి తిరువోతు నటించారు. మళ్ళీ అదే టీమ్‌తో ధూత-2 వెబ్‌ సిరీస్‌ తీయబోతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ దాదాపు పూర్తి చేశారు. కనుక త్వరలోనే ధూత-2 రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష