ఎప్పుడో ఓ సినిమా కాదు ఎప్పుడూ సినిమాలు చేయాలి!

May 31, 2026


img

ప్రముఖ నటుడు మంచు మనోజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ, “దాసరి నారాయణరావుగారు గొప్ప దర్శకుడు, నటుడు, మంచి రచయిత, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా ప్రతీరంగంపై మంచి పట్టు, ప్రతిభ ఉన్నవారు. ఆయన సినీ పరిశ్రమకు ఒక ఇన్‌స్టిట్యూట్ వంటివారు. ప్రస్తుతం మనం సినీ పరిశ్రమలో సమస్యలు పేరుకుపోయాయని మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ సమస్యకు అయన ఎప్పుడో పరిష్కారం చూపారు. 

ఎప్పుడో ఓ సినిమా చేయడం కాదు. ఎప్పుడూ ఓ సినిమా చేస్తూనే ఉండాలని చెప్పేవారు. తద్వారా సినీ పరిశ్రమలో అందరికీ ఉపాధి, తగినంత ఆదాయం, నిర్మాతలకు లాభాలు వస్తాయి. ఆయన ఏడాదికి 10-15 సినిమాలు చేస్తుండేవారు,. తన సినిమాలతో ఎంతో మంది కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. తన సినిమాలతో వేలాదిమందికి ఉపాధి కల్పించేవారు. 

అప్పుడు లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే సినిమాల సంఖ్య తగ్గడం వల్లనే. కనుక మన టాలీవుడ్‌ హీరోలందరూ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఒకటొకటిగా పరిష్కారం అవుతాయి,” అని అన్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష