స్వీయ దర్శకత్వంలో ఎస్.కృష్ణ ‘హై... టీజర్‌!

February 10, 2026


img

ఇంతకాలం దర్శకుడు అనిల్ రావిపూడి స్టోరీ టీమ్‌లో కలిసి పనిచేసిన ఎస్.కృష్ణ ‘హై’ సినిమాతో స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో నటుడుగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సోమవారం ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. 

ఈ సినిమాలో ఎస్.కృష్ణ, అనన్య పాండే, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఎస్.కృష్ణ, సంగీతం:వికాస బడిస, కెమెరా: మల్లు నాయక్, సునీల్ రెడ్డి, ఆర్ట్:బ్రహ్మానంద్ ఏ పాటిల్, స్టంట్స్: వి.వెంకట్‌, ఎడిటింగ్: జిఆర్‌కె శరన్ రావుల చేశారు.

ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్స్‌, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్.కృష్ణ, శేఖర్ దివ్వెల కలిసి ఈ ‘హై’ సినిమా నిర్మించారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.  

  


Related Post

సినిమా స‌మీక్ష