కె ర్యాంప్ టైటిల్‌ సాంగ్ కాస్త డిఫరెంట్

October 08, 2025


img

జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, యుక్తీ తరేజా జంటగా చేసిన ‘కె-ర్యాంప్’ నుంచి తిక్కల్ తిక్కల్ అంటూ సాగే టైటిల్‌ సాంగ్ విడుదలయింది. సురేంద్ర కృష్ణ వ్రాసిన ఈ పాటకి సంగీతం: చేతన్ భరద్వాజ చేయగా భాస్కరుని సాయి చరణ్ పాడారు. ‘కే-ర్యాంప్’ అక్టోబర్ 18న విడుదల కాబోతోంది.  

ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, సాయి కుమార్‌, చంద్రిక రవి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేశారు. 

హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగులతో కలిసి కే ర్యాంప్ నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష