ప్రముఖ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో మెగాఫోన్ పట్టుకొని సినిమాకు దర్శకత్వం చేయబోతున్నారు. ఈ విషయం ఆయన స్వయంగా ‘ఎక్స్’ సోషల్ మీడియాలో ప్రకటించారు. తాను తీయబోతున్న సినిమాలో నటించేందుకు ఆసక్తి కలిగిన 25-35 వయసున్న యువతులు తమ ఫోటో, వివరాలు, రీల్స్ ఏమైనా చేసి ఉంటే వాటిని తన ఈమెయిల్ ఐడీ: ramakrishnabrands@gmail.com కు పంపించాలని రాహుల్ రామకృష్ణ కోరారు.
ఊర్మీ ఫిలిమ్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రాహుల్ రామకృష్ణ స్వయంగా ఈ సినిమా నిర్మించి నటించబోతున్నట్లు సమాచారం.
రాహుల్ రామకృష్ణకి గతంలో షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్ము రా’తో సినీ ప్రస్థానం మొదలుపెట్టి, ‘డైలాగ్ రైటర్’గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ‘జాతి రత్నాలు’ సినిమాలతో హాస్య నటుడుగా మంచి గుర్తింపు పొందారు. My first directorial venture- adventure!
If interested, please mail your acting portfolios/resumes/showreels to the email ID mentioned in the picture.
:) #UrumiFilmsLLP pic.twitter.com/Q2XlBgkSb9