త్వరలో కెన్యాకు ఎస్ఎస్ఎంబీ29 టీమ్‌

June 14, 2025


img



రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన భారీ ప్రాజెక్ట్ ఒడిశాలోని కోరాపుట్‌లో మొదటి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ కోసం మహేష్ బాబుతో సహా అందరూ ఆఫ్రికాలోని కెన్యాకు త్వరలో బేయలుదేరబోతున్నారు. అక్కడ ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్ (అడవులు)లో నెల రోజుల పాటు షూటింగ్‌ జరుగబోతోంది.

ఈ షెడ్యూలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. షూటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో త్వరలోనే ఎస్ఎస్ఎంబీ29 టీమ్‌ కెన్యాకు బయలుదేరబోతోంది. 

2025, జనవరి 2న ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమార్‌, బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్ నటిస్తున్నట్లు సమాచారం. 

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎంఎం కీరవాణి, డైలాగ్స్: దేవాకట్ట అందిస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష