వెంకటేష్-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా

April 16, 2025


img

వెంకటేష్-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావు’ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నా ఇంతవరకు వీలుపడలేదు. కానీ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా చేయాలనుకుంటే, ఆయన అట్లీతో సినిమా మొదలుపెడుతుండటంతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి మద్యలో చిన్న గ్యాప్ దొరికింది. 

ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ పూర్తి చేస్తే ఎలా ఉంటుందని తన వద్ద వెంకటేష్‌ కోసం ఇదివరకు ఎప్పుడో వ్రాసుకున్న స్టోరీని చెప్పారు. అది విని వెంకటేష్‌ వెంటనే ఒప్పేసుకున్నారు. కనుక ఇద్దరూ కలిసి వీలైనంత త్వరగా సినిమా మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత వెంకటేష్‌ ఖాళీ అయ్యారు. సంక్రాంతి విక్టరీని ఎంజాయ్ చేస్తూనే మళ్ళీ వచ్చే సంక్రాంతికి అనిల్‌ రావిపూడితో మరో సినిమా చేయాలనుకున్నారు. 

కనుక ఇద్దరు దర్శకులతో వెంకటేష్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తారా లేదా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా పూర్తిచేసి అనిల్‌ రావిపూడితో మొదలుపెడతారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.         



Related Post

సినిమా స‌మీక్ష