పొంగులేటి నిర్ణయం మంచిదే కానీ..

July 15, 2017


img

తెలంగాణా శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ లో కొత్తగా ఆవిర్భవించిన బిసి ఫోరం పార్టీలో బిసిలకు సముచిత స్థానం లభించలేదంటూ ఆరోపించడంతో పొంగులేటి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. తను పదవి నుంచి తప్పుకొంటున్నట్లు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ నేడో రేపో అయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిని కలిసి ఈవిషయం చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన నిజంగానే అదే కారణంతో తన పదవి నుంచి తప్పుకోదలిస్తే అది హర్షించవలసిన విషయమే. 

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఇతర కులాలకు చెందినవారు చాలా మంది ఉన్నప్పటికీ, పార్టీ పగ్గాలు మాత్రం ఉత్తం కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జీవన్ రెడ్డి వంటి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతల చేతిలోనే ఉన్నాయని చెప్పవచ్చు. వారే పార్టీలో కీలకనేతలుగా కనిపిస్తుంటారు. రాష్ట్రంలో బిసి జనాభా ఎక్కువగా ఉన్నందున వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలనుకొంటే పార్టీలో బీసిలకు సముచిత స్థానం, తగు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కానీ పార్టీలో రెడ్డి నేతలు తమ ప్రాధాన్యతను తగ్గించుకోవడానికి ఇష్టపడతారా..సిద్దపడతారా? అంటే అనుమానమే. కనుక పొంగులేటి సుధాకర్ రెడ్డి ఒక్కరు తప్పుకొన్నంత మాత్రాన్న పార్టీకి ఒరిగేదేమీ ఉండదనే చెప్పవచ్చు. 


Related Post