వందలు పిండుకొంటూ చిల్లర విదిలిస్తోంది

July 13, 2017


img

ఒకప్పుడు సామాన్యుల బ్యాంక్ అని గొప్ప పేరు సంపాదించుకొన్న ఎస్.బి.ఐ. గత కొంతకాలంగా వారిని ముప్పతిప్పలు పెడుతూ తీరని అప్రదిష్ట మూటగట్టుకొంటోందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఒకప్పుడు ఏ గల్లీలో చూసినా ఎస్.బి.ఐ. ఎటిఎంలు కళకళలాడుతుండేవి. ఇప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయి కానీ దిష్టిబొమ్మలా ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. బ్యాంకులోనే ఉన్న ఎటిఎంలలో సైతం డబ్బు ఉండకపోవడంతో వేరే బ్యాంక్ ఎటిఎంలో డబ్బు తీసుకొంటే, “అత్యుత్తమైన సేవల కోసం ఎస్.బి.ఐ. ఎటిఎంలనే వినియోగించండి..ఇతర బ్యాంక్ ఎటిఎంలలో పరిమితికి మించి నగదు తీస్తే ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది,” అనే మెసేజ్ వస్తుంది. అది చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఎస్.బి.ఐ.ఎటిఎంలోనే డబ్బు లభిస్తే ఎవరైనా వేరే ఎటిఎంలకు ఎందుకు వెళతారు? అనే ఆలోచన ఎస్.బి.ఐ. అధికారులకు ఎందుకు తట్టదో అర్ధం కాదు.    

ఇక బ్యాంకులో డబ్బు వేసినా, తీసినా, మినిమం బ్యాలన్స్ తగ్గినా ఖాతాదారుల అనుమతి తీసుకోకుండానే వారి ఖాతాలలో నుంచి ఎస్.బి.ఐ. డబ్బు కట్ చేసి తీసేసుకొంటుంది. ఇక మెసేజ్ అలర్ట్స్, ఎటిఎంలలో నగదు విత్ డ్రా పరిమితులు అంటూ కటింగ్స్ ఉండనే ఉన్నాయి. అవికాక బ్యాంకులో ఏ చిన్న సేవ కావాలన్నా దానికి ఓ రేటు ఫిక్స్ చేసేసి ఖాతాదారుల నుంచి డబ్బు పిండుకొంటోంది. ఈవిధంగా రకరకాల పేర్లతో ఎస్.బి.ఐ.తన ఖాతాదారుల నుంచి తీసుకొనేది ఎక్కువ తిరిగి ఇచ్చేది తక్కువని చెప్పవచ్చు. ఒకవైపు తన ఖాతాదారులకు నరకం చూపిస్తూ వారి నుంచి ఏడాదికి వందల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేసుకొంటూ మళ్ళీ వారిపై గొప్ప ఉదారత చూపిస్తున్నట్లు ఈరోజు ఆన్-లైన్ ట్రాన్సాక్షన్లపై రూపాయి రెండు రూపాయిలు ఛార్జీలు తగ్గిస్తే, దానిని మన మీడియా ఎస్.బి.ఐ.ఛార్జీలలో బారీ తగ్గింపు అనే హెడ్డింగులు పెట్టి గొప్పగా వర్ణిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. వేలు, లక్షలు పంపేవారికి రూ.10,20 తగ్గింపు ఓ లెక్కా? అంటే కాదనే అర్ధం అవుతుంది.  

వివిద బ్యాంకులు, ఖాతాల మద్య నగదు బదిలీ చేసేందుకు ఉపకరించే ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలైన ఎన్.ఈ.ఎఫ్‌.టి (నెఫ్ట్), ఆర్‌.టి.జి.ఎస్.ల కమీషన్ చార్జీలను ఈనెల 15వ తేదీ నుంచి ఎస్.బి.ఐ. తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 




Related Post