రాహుల్ అసూయతోనే మోడీని విమర్శిస్తున్నారా?

July 07, 2017


img

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా అనర్హుడని పార్టీలో నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి అని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. జర్మనీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాదినేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో కరచాలనం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోను ట్వీట్టర్ లో జోడించి, చైనా విషయంలో మోడీ ఎందుకు  ఎందుకు మౌనం వహిస్తున్నారని రాహుల్ గాంధీ ఈరోజు ట్వీట్ చేశారు. 

చైనా విషయంలో యూపియే ప్రభుత్వంతో పోలిస్తే మోడీ సర్కార్ చాలా బలంగా ఎదుర్కోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. భారత్-భూటాన్-చైనా దేశాలు కలిసే డొక్లాం జంక్షన్ వద్ద మోహరించిన భారత సైనికులను తక్షణమే వెనక్కు వెళ్ళాలని లేకుంటే తరిమికొడతామని చైనా హెచ్చరించినప్పుడు, మేము వెనక్కు తగ్గం..మీ సేనలనే వెనక్కు పంపించమని ఘాటుగా భారత్ బదులిచ్చింది. కాంగ్రెస్ హయంలో ఇటువంటి జవాబు ఎన్నడూ చూడలేదు కనీసం ఊహించలేము. 

ఇక బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడుని కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావించడం మనకు ఎంత అవసరమో, చైనాకు అంతే అవసరం. ఎందుకంటే రెండు దేశాలు ఎదుటవారే దురాక్రమణకు పాల్పడుతోందని వాదించుకొంటున్నాయి. చైనా అధ్యక్షుడు ఈ సమస్య గురించి ప్రస్తావించకుండా తీవ్రవాదాన్ని అరికట్టేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవడం విశేషం. అందుకే మోడీ కూడా చైనాకు పరోక్షంగా చురకలు వేశారు తప్ప డొక్లాం వద్ద నెలకొన్న ఉద్రిక్తతల గురించి మాట్లాడలేదు. కానీ ఇరుదేశాల దౌత్యాధికారులు ఈ సమస్యపై చర్చించకుండా ఉండరు.

అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలలో ఆ దేశాధినేతలు ప్రధాని మోడీని ఎంత గొప్పగా గౌరవించారో, ఎంతగా ప్రశంసించారో అందరూ చూశారు. మోడీకి అటువంటి రాచమర్యాదలు, సర్వత్రా ప్రశంసలు రావడం చూసి జీర్ణించుకోలేని రాహుల్ గాంధీ బహుశః అసూయతో లేదా ఆత్మన్యూనతతో మోడీపై ఈవిధంగా విమర్శలు గుప్పిస్తున్నట్లు చెప్పవచ్చు. పార్టీ పగ్గాలు కూడా చేపట్టలేకపోతున్న రాహుల్ గాంధీ నానాటికీ పెరిగిపోతున్న మోడీ కీర్తిప్రతిష్టలను చూసి అసూయపడటం సహజమే. కానీ అది మోడీ తప్పు కాదు.  


Related Post