భారత్ లో ఎఫ్-16 యుద్ధవిమానాల తయారీ?

June 19, 2017


img

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రపంచంలోనే అత్యాధునికమైన ఎఫ్-16 యుద్ధవిమానాలను కొనుగోలు చేయడమే చాలా గొప్ప విషయం. అటువంటిది ఆ యుద్దవిమానాలను భారత్ లోనే తయారుచేయడం అంటే అది కలలో కూడా ఊహించనిదే. కానీ ఆ కలను మోడీ సాకారం అయ్యేలా చేశారు. ఇంతవరకు విదేశాలు తయారుచేస్తున్న యుద్ద విమానాలను కొనుగోలు చేయడానికే భారత్ పరిమితమై ఉండేది. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వాటిని దేశంలో ఉత్పత్తి చేస్తేనే కొనుగోలు చేస్తామని షరతు విధించారు. 

వేలకోట్ల కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ఎఫ్-16 యుద్ధవిమానాలను తయారుచేస్తున్న లాక్ హీడ్ మార్టిన్ అందుకు అంగీకరించింది. దాని కోసం ఇప్పటికే ఈ రంగంలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో సోమవారం ఒప్పందం చేసుకొంది. టెక్సాస్ లో ఫోర్ట్ వర్త్ అనే ప్రాంతంలో ఉన్న తమ ప్లాంటును భారత్ కు తరలించి, మేక్ ఇన్ ఇండియా పధకంలో భాగంగా భారత్ లోనే ఎఫ్-16 యుద్ధవిమానాలను ఉత్పత్తి చేసేందుకు అంగీకరించింది. 

లాక్ హీడ్, టాటా రెండూ కూడా చాలా పెద్ద సంస్థలే కనుక త్వరలోనే భారత్ లో ఎఫ్-16 యుద్ధవిమానాల తయారీ సంస్థను ఏర్పాటు చేయడం తధ్యం అని చెప్పవచ్చు. భారత్ లో ఎఫ్-16 యుద్ధవిమానాలు ఉత్పత్తి చేయడం మొదలైతే ఇంతవరకు యుద్ధవిమానాల కొనుగోలుకే పరిమితమైన భారత్ అప్పుడు ఇతర దేశాలకు వాటిని అమ్మే స్థాయికి ఎదుగుతుంది. దానివలన ఊహించని స్థాయిలో విదేశీమారకం సమకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చాలా తెలివైన వ్యూహంతో అటు ఆ సంస్థకు, ఇటు భారత్ కు కూడా లబ్ది కలిగించడం విశేషం. అందుకు ఆయనను అభినందించవలసిందే!


Related Post