అన్నిటికీ అదే మంత్రమా? షబ్బీర్ ప్రశ్న

June 16, 2017


img

మియాపూర్ భూకుంభకోణం గత ప్రభుత్వాల పాపమే అని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెరాస అధికారంలోకి వచ్చి మూడేళ్ళయింది. ఈ మూడేళ్ళలో అది చేసిందేమీ లేదు కానీ వరుసగా కుంభకోణాలు బయటపడుతున్నాయి. మొదట అంబులెన్సుల కుంభకోణం, తరువాత పరీక్షా పత్రాల లీకేజ్, నయీం వ్యవహారం, ఇప్పుడీ మియాపూర్ కుంభకోణం ఒకటొకటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఏది బయటపడినా అన్నిటికీ గత ప్రభుత్వాలదే బాధ్యత అని గట్టిగా వాదించడం తెరాసకు అలవాటుగా మారిపోయింది. ఆవిధంగా తన తప్పులను దాచిపెట్టుకొందామని ప్రయత్నిస్తే అంతకంటే అవివేకం ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు తెరాసకు తప్పకుండా బుద్ధి చెప్పుతారు. మియాపూర్ భూకుంభకోణం గురించి మేము ఇంత మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఇంత బారీ కుంభకోణం జరిగితే ఎక్కడా అవినీతి జరుగలేదని, ప్రభుత్వానికి నష్టం కలుగలేదని ఎందుకు వాదిస్తున్నారు? సిబిఐ దర్యాప్తుకు ఎందుకు వెనుకాడుతున్నారు?” అని ప్రశ్నించారు.        



Related Post