పెరట్లో గెలవలేని పార్టీ పగటి కలలు కంటోంది: కేటిఆర్

June 01, 2017


img

ఈరోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో తెరాస ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలకు మంత్రి కేటిఆర్ అంతే ధీటుగా బదులిచ్చారు. స్కాంగ్రెస్ నేతలు అవినీతి గురించి మాట్లాడటం మిలీనియం జోక్ అని అన్నారు. రాష్ట్రంలో తమ ఉనికిని, గౌరవాన్ని పోగొట్టుకొన్న కాంగ్రెస్ నేతలు వ్రాసిచ్చిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ చిలకలా వల్లె వేశారని అన్నారు. మాది జాతీయ పార్టీ... మేము జాతీయ నాయకులం అని గొప్పగా చెప్పుకొంటారు కానీ స్వంత పెరట్లోనే గెలవలేరు కానీ తెలంగాణాలో గెలవాలని పగటికలలు కంటున్నారని కేటిఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి మేడిన్ తెలంగాణా వస్తువులను చూడాలనే కోరిక ఉంటే తెలంగాణాలో తయారవుతున్న 5 మొబైల్ కంపెనీలను సందర్శిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. 



Related Post