తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకు తిరస్కరించారు?

May 24, 2017


img

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో పర్యటించడం చాలా తప్పు నేరం అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన పర్యటనతో అధికారంలో ఉన్న తెరాస అభద్రతాభావానికి లోనైతే అది సహజమే అనుకోవచ్చు కానీ ప్రతిపకక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు కంగారుపడుతోంది? అంటే జాతీయస్థాయిలో తమ పార్టీ నేతలు భాజపాతో, మోడీ సర్కార్ తో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటారు. కనుక రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను ఎదుర్కోవలసిన బాధ్యత తమపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తుంనందునే కావచ్చు లేదా రాష్ట్రంలో భాజపా తమకి పోటీగా తయారవుతుందనే భయం చేతకావచ్చు.   

విభజన చట్టంలో తెలంగాణాకు ఇచ్చిన హామీల గురించి, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అమిత్ షా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం అని సుధాకర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణాకు ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా మంజూరు చేయని భాజపా నేతలకు రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. 

ఇటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారని ఒకసారి కాంగ్రెస్ నేతలు ఆలోచించుకొంటే సమాధానం వారికే దొరుకుతుంది. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆంధ్రా, తెలంగాణా రెంటినీ  అన్ని విధాల భ్రష్టు పట్టించి వదిలిపెట్టింది. తెలంగాణా ఏర్పడే నాటికి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం...ఆ కారణంగా ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కుంటుపడటం అందరూ కళ్ళారా చూశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ ఇటువంటి దుస్థితి నెలకొని ఉండేది. కానీ ఆ తరువాత  కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రెండూ చక్కటి సయోధ్యతో పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత 5-6 దశాబ్దాలుగా చేయలేని అనేకానేక పనులను ఈ మూడేళ్ళలోనే తెరాస సర్కార్ చేసి చూపిస్తోంది. దానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తోంది. తెరాస, భాజపాల మద్య రాజకీయంగా విభేదించుతుండవచ్చు. కానీ అది అభివృద్ధికి అవరోధం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేతలు ఇది గమనించే ఉంటారు. కానీ విమర్శించక తప్పదు కనుక విమర్శిస్తున్నట్లున్నారు. 



Related Post