ప్రధాని మోడీ బాటలో కేసీఆర్

May 17, 2017


img

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం (జి.ఎస్.టి.) అమలు చేయడం వంటి అనేక సంస్కరణలు చేపడుతున్నారు. వాటిలో భాగంగానే ఈ ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఒక నెల ముందుకు జరిపి ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించారు. గత అనేక దశాబ్దాలుగా మన దేశంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్ధిక  సంవత్సరంగా పరిగానిస్తున్నాము. దానిని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి డిశంబర్ 31కి మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈవిషయంలో ప్రధాని నరేంద్ర మోడీ బాటలోనే నడవాలని నిర్ణయించుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మరియు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో దీని గురించి చర్చించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ మార్పుకు సిద్దం అయినట్లు ఈనెల 2వ తేదీన ప్రకటించింది. కనుక మంత్రి ఈటెల అధికారులను వెంటబెట్టుకొని మధ్యప్రదేశ్ వెళ్ళి ఆర్ధిక సంవత్సరం మార్పు చేయడానికి ఏవిధమైన ఏర్పాట్లు చేశారో అధ్యయనం చేసి రమ్మని ఆదేశించారు. వీలైతే వచ్చే ఏడాది నుంచి ఆర్ధిక సంవత్సరం మార్చుదామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  

ఆర్ధిక సంవత్సరం మార్పు చేయడం వలన ఏమి ప్రయోజనం అని కొంతమందికి సందేహం కలుగవచ్చు. మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. కనుక జనవరి 1వ తేదీకల్లా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పూర్తిసాయి బడ్జెట్లు రూపొందించుకొని, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించగలిగితే అవి సకాలంలో రైతులకు చేతికి అందుతాయి కనుక రైతులకు మేలు కలుగుతుంది. అదేవిధంగా పంటలు వేసే ముందు రైతులకు చాలా అవసరమైన సమయంలోనే బ్యాంకు రుణాలు వగైరాలు చేతికి అందే అవకాశం ఏర్పడుతుంది.


Related Post