చరిత్రలో ఒకడు.. అమరేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్..!

April 28, 2017


img

తమ హీరో సినిమా కలక్షన్స్ మాత్రమే కాదు సినిమా టీజర్ రికార్డుల గురించి కూడా రచ్చ చేసే స్టార్ హీరో ఫ్యాన్స్ కేవలం తమ హీరోకే సొంతమైన యూనిక్ రికార్డుల గురించి ఎంత హంగామా చేస్తారో మాటల్లో చెప్పనవరసరం లేదు. ఇంతకీ విషయం ఏంటి అంటే తెలుగు సినిమా స్థాయి, పరిధి రెండిటికి ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. 


కేవలం ఒక సినిమా అన్న విధంగా కాకుండా ఇది ఓ యజ్ఞం.. తెలుగు సినిమా యొక్క ప్రభంజనం అంటే బాగుంటుందేమో. రొటీన్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు స్వస్థి చెప్పి ఇదిరా తెలుగు సినిమా సత్తా అంటూ పరభాషా వారికే కాదు ప్రపంచ దేశాలకు తెలియచేసిన సినిమా బాహుబలి.


ఇక ఈ సినిమా ముఖ్య యోధులు ఇద్దరే.. వారే దర్శకధీరుడు రాజమౌళి.. అమరేంద్ర బాహుబలి అలియాస్ మహేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్. తమ హీరో సినిమా చూసి ఫ్యాన్స్ గర్వపడేలా చేయడం లో ప్రభాస్ ఎప్పుడు ముందుంటాడు. అందుకే ఒక సినిమా కోసం ఐదేళ్ల కెరియర్ ఫణంగా పెట్టాడు. ఇది కచ్చితంగా ప్రభాస్ కు దక్కాల్సిన రాజ కిరీటమే. అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ చూపించిన అభినయం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రతి సినిమా అభిమాని మనసుకి హత్తుకుంటుంది.


ఓ దర్శకుడి కలని నెరవేర్చే క్రమంలో హీరోగా తను ఎలాంటి రిస్క్ తీసుకోగలడో అన్నిటిలో నూరు శాతం న్యాయం చేస్తూ బొమ్మని తిరుగులేని విధంగా చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ను చూసి స్టార్ హీరోలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అనుకున్న కమిట్ మెంట్ ప్రకారం కాస్త అటు ఇటైనా సరే దర్శకుడి మీద నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నం కెరియర్ రిస్క్ లో పడేస్తుంది అని తెలిసినా అవేవి లెక్క చేయకుండా బాహుబలి కోసం ఐదేళ్ల కెరియర్ ను త్యాగం చేశాడు. అందుకే ఇప్పుడు అందుతున్న ఈ జయజయ గీతాలకు ప్రభాస్ అర్హుడని అంటున్నారు. 


తన అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుత సినిమా అందించాలనే ఆలోచనతో ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా చరిత్రలో మిగిలిపోతుంది. అభిమానుల అండదండలుంటే ఇలాంటి సినిమాలు ఒకటి రెండేంటి ప్రతి హీరో తీసేందుకు సిద్ధపడతాడు. ముందు మార్గం చూపిన యంగ్ రెబల్ స్టార్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నాడు ప్రతి ఒక్క తెలుగు సిని ప్రేమికుడు.    



Related Post