తెరాస సర్కార్ కు దత్తన్న చురకలు

April 22, 2017


img

రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ ను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ కేంద్ర కార్మికశాఖామంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాసుకుపూసుకు తిరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఆయన నోట తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా ఎన్నడూ విమర్శలు వినపడవు. కానీ శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన బీసీ ప్రతినిధుల మహాసభలో తెరాస సర్కార్ కు స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలోనే చురకలు వేశారు.   

“రాష్ట్రాలలో బిసి కమీషన్లు బీసిల ప్రయోజనాలను కాపాడేవిధంగా పనిచేయాలి. కానీ అవి రాష్ట్ర ప్రభుత్వం ఏది చెపితే ఆవిధంగానే నివేదికలు తయారుచేసి ఇస్తున్నాయి. దీనినే మరోవిధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు కావలసిన విధంగా దాని చేత నివేదికలను తయారు చేయించుకొని, బిసి కమీషన్ సిఫార్సులనే తాము అమలుచేస్తున్నట్లు చెప్పుకొంటోంది. ఇది సరికాదు. బీసిలలో అన్ని కులాల ప్రజల స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం మాత్రమే కమీషన్ నివేదిక ఇవ్వాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుకొన్నవిధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇవ్వడం, అదిచ్చిన నివేదికనే తమ ప్రభుత్వం అమలుచేస్తోందని చెప్పడం రెండూ తప్పే. దాని వలన బీసిలకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది,” అని దత్తాత్రేయ అన్నారు.    


Related Post