ఫిరాయింపులకు బలయ్యేది ఎవరు? ప్రజలా పార్టీలా?

April 04, 2017


img

భాజపా నేత డి.పురందేశ్వరి వైకాపా ఎమ్మెల్యేలను తెదేపా ప్రభుత్వంలో మంత్రులుగా చేర్చుకోవడాన్ని తప్పు పట్టారు. అది అప్రజాస్వామికం, అనైతికమని విమర్శించారు. 

నిజమే ఇది అనైతికమని అందరికీ తెలుసు. కానీ రాజకీయ పార్టీలు, వాటి నాయకులు క్రమంగా ఒక్కో మెట్టు దిగుతూ తమ విలువలను దిగజార్చుకొంటున్నపుడు దేనికి వారు సిగ్గుపడటం లేదు. పైగా తమను ఎన్నుకొన్న ప్రజలను మోసం చేసినప్పటికీ వారి కోసమే పార్టీ ఫిరాయించామని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. అందుకు ప్రజలు వారినేమీ చేయలేకపోవచ్చు. కానీ రాజకీయాలలో ఉన్నవారు ఎంతగా దిగజారితే అంతగా వారే నష్టపోక తప్పదని మరిచిపోతున్నారు. ఈ దుసంప్రాదాయాన్ని ప్రోత్సహించి ఏదో ఒక పార్టీ తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు కానీ ఏదో ఒకరోజు అది కూడా దాని బారిన పడకతప్పదు...మూల్యం చెల్లించక తప్పదు. 

ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైకాపాలో ఫిరాయించినపుడు కాంగ్రెస్ నష్టపోయింది. తెదేపా, కాంగ్రెస్, వైకాపా ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించినప్పుడు ఆ మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఏపిలో వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా ఆ పార్టీ నష్టపోయింది. ఈ ఫిరాయింపుల కారణంగా తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఈ రోజు అధికారంలో ఉన్నవారు చేసిందే రేపు అధికారంలోకి వచ్చేవారు తప్పకుండా చేస్తారు కనుక రేపు తెదేపా లేదా తెరాసల కూడా ఇలాగే నష్టపోవచ్చు. అంటే ఒక మెట్టు దిగజారితే ప్రజల కంటే ఆ పార్టీలే ఎక్కువగా నష్టపోతున్నాయని స్పష్టం అవుతోంది.


Related Post