చిన్నబాబుకు మూడు పదవులు!

April 03, 2017


img

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొత్తగా జేరిన 11 మంది మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శాఖలు కేటాయించారు. ఆ వివరాలు: 

నారా లోకేష్: ఐటి, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి

భూమా అఖిలప్రియ: పర్యాటక శాఖ, తెలుగు భాష, సంస్కృతి 

కిమిడి కళా వెంకట్రావు (తెదేపా ఏపి అధ్యక్షుడు) : ఇంధనశాఖ 

వెంకట సుజయ్ కృష్ణ రంగారావు: భూగర్భ, గనుల శాఖ 

కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌: ఎక్సైజ్ శాఖ  

పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ 

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వ్యవసాయం, అనుబంధ శాఖలు, ఉద్యానవన శాఖ 

నక్కా ఆనంద బాబు: సామాజిక, గిరిజన సంక్షేమం 

ఆదినారాయణరెడ్డి: మార్కెటింగ్‌,  పశుసంవర్థక, మత్స్య శాఖ

ఎన్‌ అమరనాథ్‌రెడ్డి: పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద అట్టేబెట్టుకొన్న శాఖలు: మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనార్టీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ.

పార్టీలో అనేకమంది అనుభవజ్ఞులు, సీనియర్లు మంత్రిపదవులను ఆశించి భంగపడిన సంగతి తెలిసిందే. వారికి మొండి చెయ్యి చూపిన చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ కు ఎటువంటి పరిపాలనానుభావం లేకపోయినా కీలకమైన మూడు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టడం విశేషం. అలాగే వైకాపా నుంచి కొత్తగా తెదేపాలో చేరిన వారికి కూడా కీలకమైన పదవులే కట్టబెట్టారు. అందుకే మంత్రిపదవులను ఆశించి భంగపడిన పార్టీలో సీనియర్లు రాజీనామాలకు సిద్దం అయ్యారు. చంద్రబాబు నాయుడు కొందరిని తన వద్దకు పిలిపించుకొని మరికొందరికి ఫోన్ ద్వారా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అందరూ చల్లబడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ పదవుల పంపకాలు తెదేపాలో అగ్గి రగిలించకుండా ఉంటాయా? ఏమో? 


Related Post