ఉస్కా మతలబ్ క్యా హై జనాబ్?

March 23, 2017


img

తెరాస సర్కార్ ప్రతిపాదిస్తున్న ముస్లిం రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా శుక్రవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకొనేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ చెప్పారు. 

దేశంలో అన్ని మతాల ప్రజలకు తమకు సమానమేనని భాజపా నేతలు చెపుతుంటారు. తమ పార్టీ ముస్లింలను వ్యతిరేకించడం లేదని కేవలం మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే వ్యతిరేకిస్తోందని భాజపా నేతలు చెపుతున్నారు. అది నిజమే కావచ్చు. కానీ వారి  చర్యలు ప్రజలకు..ముఖ్యంగా ముస్లింలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయనే సంగతి గ్రహించడం లేదు..లేదా గ్రహించినా దాని వలన తమకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని భావిస్తున్నట్లున్నారు. 

అయితే తెరాస సర్కార్ నిజంగా ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించగలదా? అంటే లేదనే అర్ధమవుతుంది. అది అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపగలదు అంతే. కేంద్రం అంగీకరించితేనే దానికి మోక్షం లభిస్తుంది. ఈ సంగతి తెరాస, భాజపా రెంటికీ చాలా బాగా తెలుసు. అయినా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస, వీల్లేదని భాజపా వాదించుకొంటున్నాయి. అంటే అర్ధం ఏమిటి? ప్రజలే ఆలోచించుకోవలసి ఉంటుంది. 


Related Post