కొడుక్కే హ్యాండిచ్చిన తండ్రి!

December 28, 2016


img

యూపి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు ఎక్కువయిపోతున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ములాయం సింగ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ ఇచ్చిన అభ్యర్ధుల జాబితాను పక్కనపడేసి తన తమ్ముడు ఇచ్చిన జాబితాను ఖరారు చేసేసి షాక్ ఇచ్చారు. పైగా అఖిలేష్ యాదవ్ అనుచరులుగా పేరొందిన అనేకమందికి టికెట్లు నిరాకరించి ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 402 స్థానాలు ఉంటే వాటిలో 325 స్థానాలకు తమ్ముడు శివపాల్ యాదవ్ సూచించిన అభ్యర్ధులకే టికెట్లు ఖరారు చేసేశారు.

అంతేకాదు...ప్రస్తుతం తన కొడుకే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అతనిని ప్రకటించకుండా, ఎన్నికలలో గెలిచినా తరువాత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకొంటారని ప్రకటించారు. అతని చిన్నాన్న, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ చాలా ఏళ్ళుగా ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారు. బహుశః అందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ ని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించలేదని చెప్పవచ్చు. కనుక ఒకవేళ సమాజ్ వాదీ పార్టీయే గెలిచినా అఖిలేష్ యాదవ్ కి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే చెప్పవచ్చు. కనుక అఖిలేష్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకొనే సమయం ఆసన్నమయినట్లే చెప్పవచ్చు. 


Related Post