రాయలసీమ పనులు నేనే వేగవంతం చేశా: జగన్‌

January 09, 2026


img

రాయలసీమ ఎత్తిపోతల పధకంపై ఇటీవల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేనే ఆ ప్రాజెక్ట్ పనులు ఆపించేశాను,” అని చెప్పుకుంటే, “కాదు 2020లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌తో మాట్లాడి మేమే ఆపించేశామని,” హరీష్‌ రావు చెప్పుకున్నారు. 

ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఇలా వాదించుకుంటూ ఉంటే, అక్కడ ఏపీలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం జగన్‌వాదించుకుంటున్నారు. 

మేమే ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేశామని, కానీ తెలంగాణ పాలకుల ఒత్తిళ్ళకు తలొగ్గి మీరే పనులు నిలిపివేశారని పరస్పరం వాదించుకుంటున్నారు. 

జగన్‌పై ఒత్తిడి చేసి ఈ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయించామని హరీష్‌ రావు చెప్పుకున్నారు. కానీ అది నిజం కాదని జగన్‌ చెప్పిన ఈ మాటలు వింటే అర్ధమవుతుంది.           


Related Post