మినిస్టర్ అజారుద్దీన్!

October 31, 2025


img

భారత్‌ క్రికెటర్‌గా తన సత్తా చాటుకున్న మహ్మద్ అజారుద్దీన్‌, రాజకీయాలలో ప్రవేశించి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆయన జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటే, సిఎం రేవంత్ రెడ్డి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఈరోజు ఉదయం ఆయన రాజ్ భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అయనకు ఏ శాఖ కేతాయిస్తారో మరికొద్ది సేపటిలో ప్రకటన వెలువడుతుంది. 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ముందు మహ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను కాంగ్రెస్‌ పార్టీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తొందని బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశాయి. కనుక ఎన్నికల సంఘం దీనిపై అభిప్రాయం కోరుతూ ఈసీకి లేఖ వ్రాసింది.

కానీ అది స్పందించే లోగానే మహ్మద్ అజారుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. కనుక ఇక ఈసీ కూడా ఈ పిర్యాదుని పక్కన పెట్టేయవచ్చు. 

మహ్మద్ అజారుద్దీన్‌ని మంత్రిగా చేస్తేనే జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లు ప్రభావితం అవుతారని బీఆర్ఎస్‌ పార్టీ ఆందోళన చెందుతుంటే, సిఎం రేవంత్ రెడ్డి నిన్న ముంబైలో ఓ శుభకార్యంలో  ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఫోటో దిగి మరోసారి షాక్ ఇచ్చారు. వారిరువురి ఫోటోని చూసి సల్మాన్ అభిమానులు, ముస్లిం ఓటర్లు ఏవిదంగా స్పందిస్తారో వేరే చెప్పక్కరలేదు.  

కనుక జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కి కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని సిఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు.



Related Post