తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకోవాల్సిన స్థితిలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. ఈ మాటన్నది మరెవరో కాదు అయన కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిన తాజా వీడియోలో కేటీఆర్ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “కాంగ్రెస్, బీజేపి రెంటింటి లక్ష్యం ఒక్కటే. కేసీఆర్‌ని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడమే. ఎందుకంటే కేసీఆర్ ఓ కొరకు రాని కొయ్య. ఆయన ఎవరికీ భయపడరు... ఎవరికీ లొంగరు. కనుక ఆయనని అడ్డు తొలగించుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపిలు తమలో తాము తేల్చుకోవాలనుకుంటున్నాయి. కనుక కేసీఆర్‌ని మనమే కాపాడుకోవాలి. అవునా కాదా?” అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపి, చంద్రబాబు నాయుడు నుంచి కేసీఆర్ కాపాడుతున్నారని, ఆయన తెలంగాణకు మాత్రమే కాదు ‘దేశ్ కీ నేత’ అని కేటీఆర్‌తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు సగర్వంగా చెప్పుకుంటారు.
తెలంగాణ రాష్ట్రాన్ని, దాని ప్రయోజనాలను, ప్రజలను కాపాడే కేసీఆర్‌ని ప్రజలే ఆయనని కాపాడుకోవాల్సినంత బలహీనుడైపోయారా?
కాంగ్రెస్, బీజేపిల నుంచి తనని తాను, తన పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉంటే, ఇక ప్రజలను ఎలా కాపాడగలరు?ఇంతకీ కేటీఆర్ తన తండ్రిని కాపాడమని ప్రజలను అభ్యర్దిస్తున్నారా లేక బీఆర్ఎస్ పార్టీనా?

కాంగ్రెస్ - బీజేపీ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటే.. టార్గెట్ కేసీఆర్ 🎯

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క నికార్సైన గొంతుక కేసీఆర్.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.

జై తెలంగాణ ✊@KTRBRS pic.twitter.com/An1QJta1sU
— BRS Party (@BRSparty) September 18, 2025