కవిత రాజీనామా ఇంకా ఆమోదించలేదు.. దేనికో?

September 18, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ కాగానే కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, దాని ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. ‘స్పీకర్‌ ఫార్మాట్’లో రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించి తక్షణం దానిని ఆమోదించాల్సిందిగా ఫోన్‌లో అభ్యర్ధించారు. 

ఆమె తనంతట తానుగా రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కనుక ఆమె రాజీనామాని వెంటనే ఆమోదించవచ్చు. ఆమె సెప్టెంబర్‌ 3న రాజీనామా చేస్తే ఇంతవరకు దానిని ఆమోదించలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, కాస్త ముందు వెనుకగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కనుక  ఆరు నెలల్లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నందునే ఆమె రాజీనామా  ఆమోదించలేదని సమాచారం.



Related Post