రాహుల్ కి వినతి పత్రాలు ఇస్తే ఏమి ప్రయోజనం?

November 24, 2016


img

దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి మంచో చెడో ఏదో ఒక పేరుంది. అటువంటి గొప్ప జాతీయపార్టీకి ఉపాద్యక్షుడైన రాహుల్ గాంధీ భవిష్యత్ మాత్రం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. నెహ్రూ వారసుడిగా వంశపారంపర్యంగా తనకి సంక్రమించిన హక్కు ప్రకారం ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని పాలించాలనుకొన్నారు రాహుల్ గాంధీ. కానీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి కూడా అర్హుడు కాడని ఆ పార్టీ నేతలే చెప్పుకొంటుంటారు. 

దేశంలో ఏ రాష్ట్రంలోనయినా ఎన్నికలు జరుగుతుంటే ముందుండి పార్టీని నడిపించడానికి ఆయన వెనుకాడుతుంటారు. ఆ భయంతోనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి కూడా భయపడుతుంటారని ఇప్పటికే చాలాసార్లు రుజువయింది. తన భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో తనకే తెలియదు. అటువంటి వ్యక్తిని కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు నమ్ముకోవడమే ఒక విచిత్రం. ఆయన తప్ప మరెవరూ పార్టీని నడిపించలేరనుకోవడం చాలా విచిత్రంగా కనిపిస్తుంది.

రాహుల్ గాంధీ వచ్చే నెల 16వ తేదీ తరువాత రాష్ట్రంలో పర్యటనకి రాబోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. వివిధ ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేస్తున్నార్. ఆ సందర్భంగా వారు రైతులు, విద్యార్ధుల దగ్గర నుంచి పిర్యాదులు, వినతి పత్రలు, దరఖాస్తులు సేకరిస్తున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు వాటిని ఆయనకి అందజేస్తారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపిస్తారుట. 

కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రలు చేసినప్పుడు రైతుల దగ్గర నుంచి ఇలాగే వేలాదిగా వినతిపత్రాలు సేకరించారు. ఆ తరువాత వాటిని చెత్తబుట్టలో పడేశారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణాలో కూడా వినతి పత్రాలు స్వీకరించడానికి వస్తున్నారు. వాటిని ఆయన ఏమి చేస్తారో తెలియదు. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ అధికారంలో లేని రాలేని రాహుల్ గాంధీకి సమర్పించడం వలన ఏమి ప్రయోజనం? అయినా తన భవిష్యత్తునే తీర్చిద్దిద్దుకోలేని వ్యక్తి ఇక ప్రజల సమస్యలు ఏవిధంగా తీర్చగలడు? తన పార్టీని ఏవిధంగా ఉద్దరించగలడు? అని కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా!


Related Post