ప్రధాని నరేంద్ర మోడీ నోట్లు రద్దు నిర్ణయం ప్రకటించినప్పతి నుంచి మీడియాకి మొహం చాటేసిన జగన్ రేపు మళ్ళీ ప్రజలలోకి రాబోతున్నారు. ఆయన పది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో దానవాయిపేటలో పర్యటించవలసి ఉంది. కానీ ‘అనివార్య కారణాల చేత’ ఆ పర్యటనని రద్దు చేసుకొన్నారు. నోట్ల రద్దు జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా అయన రేపు ప్రజలలోకి రాబోతున్నారు కనుక దానిపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. తెదేపా నేతల వాదనలు నిజమనుకొంటే ఆయన కూడా చాలా బారీగా నల్లధనం నష్టపోయుండాలి. కానీ మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే, నల్లధనం ఉన్నవారిని వెనకేసుకు వస్తున్నట్లు అవుతుంది కనుక నోట్ల రద్దు నిర్ణయం కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే పాయింట్ తో కేంద్రప్రభుత్వాన్ని విమర్శించవచ్చు.
అలాగే చంద్రబాబు నాయుడుకి ఈ విషయం ముందే తెలుసు కనుక సర్దేసుకొన్నారని రోజా ద్వారా స్టేట్ మెంట్ ఇప్పించారు కనుక రేపు జగన్ కూడా చంద్రబాబు కూడా బెట్టుకొన్న నల్లధనాన్ని ఏవిధంగా వైట్ గా మార్చుకొన్నారు? ఆయన అందుకే తరచూ విదేశాలకి వెళ్ళి వస్తుంటారని ఆరోపణలు చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ, మోడీ నిర్ణయం వలన జగన్మోహన్ రెడ్డి ఏమేరకు నష్టపోయారు? ఈ సమస్య నుంచి ఆయన ఏవిధంగా గట్టెక్కుతారు?దీని ప్రభావం ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ఏ మేరకు పడుతుంది? దానిని ఆయన ఏవిధంగా తట్టుకొంటారు?వంటి అనేక సందేహాలకి ఆయన జవాబు చెప్పరు కనుక కాలమే చెప్పాలి.