టిజిఎస్‌ఆర్టీసీపై ఇంత ద్వేషం దేనికి... ఎవరికి?

June 13, 2024


img

టిజిఎస్‌ఆర్టీసీ బస్సులలో టికెట్‌ ఛార్జీలు పెంచిన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా తమ సంస్థకు వ్యతిరేకంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా ఫీజులు పెంచడంతో వాటి ద్వారా పయనించే బస్సులలో మాత్రమే ఆ మేరకు ఛార్జీలు సవరించాము తప్ప ఇతర మార్గాలలో టికెట్‌ ఛార్జీలు పెంచలేదని వీసీ సజ్జనార్ ట్వీట్‌ చేశారు. తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విదంగా ఇటువంటి దుష్ప్రచారం చేస్తే పోలీసుల సాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ ఘాటుగా ఓ సందేశం పోస్ట్ చేశారు. 

టిజిఎస్‌ఆర్టీసీని లక్ష్యంగా చేసుకొని కొందరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏదైనా రాజకీయ పార్టీ ఈవిదంగా చేయిస్తోందా లేక ఎవరైనా ఆకతాయిలు చేస్తున్నారా? అనేది విచారణ జరిపించి తెలుసుకోవడం అవసరమే.   



Related Post