ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీ మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం 72 మంది కలిగిన మోడీ మంత్రివర్గంలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, మిగిలిన 36 మంది సహాయ మంత్రులున్నారు. సహాయ మంత్రులలో ఐదుగురు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారున్నారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలలో కిషన్ రెడ్డి కేంద్రమంత్రి హోదాలో బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్‌ని హోమ్ శాఖ సహాయ మంత్రిగా పదవులు లభించాయి.
ఏపీ టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి హోదాలో పౌరవిమాన శాఖ, తొలిసారిగా ఎంపీలుగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ (టిడిపి)కు సహాయమంత్రి హోదాలో గ్రామీణాభివృద్ధి, టెలీ కమ్యూనికేషన్స్ శాఖ, భూపతిరాజు శ్రీనివాస ప్రశాంత్ వర్మ (బీజేపీ)కు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి పదవి లభించింది.