తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఈటల రాజేందర్‌?

June 09, 2024


img

తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు లభిస్తాయని ముందే తెలియడంతో వాటి కోసం బీజేపీ ఎంపీలు పోటీ పడ్డారు. వారిలో ఈటల రాజేందర్‌ కూడా ఒకరు. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆ పదవులు దక్కాయి. కనుక బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈసారి ఎన్నికలలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం, ఇదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడటంతో రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మంచి అవకాశం ఏర్పడింది. 

బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ బలాలు, బలహీనతల గురించి, ఈటల రాజేందర్‌కి బాగా తెలుసు. పైగా కేసీఆర్‌ చేతిలో దారుణంగా పరాభవిమపబడటంతో కేసీఆర్‌ మీద రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. 

తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ మంత్రిగా ఈటల రాజేందర్‌కు మంచి పేరు, అనుభవం ఉన్నాయి. రాష్ట్రానికి సంబందించిన ప్రతీ విషయంపై పూర్తి అవగాహన ఉంది. కనుక ఈటల రాజేందర్‌కి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో స్థిరపడగానే ఈటల రాజేందర్‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. 



Related Post