రేవంత్‌ ప్రభుత్వం కూడా వాస్తు నమ్మకాలే?

June 04, 2024


img

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు, గ్రహాలు, జ్యోతిష్యంపై చాలా నమ్మకముండేదని, అందుకోసం పాత సచివాలయాన్ని కూలగొట్టించి కొత్త సచివాలయం వాస్తు ప్రకారం నిర్మించుకున్నారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కూడా రాజకీయ గండాలు పొంచి ఉంటంతో వాటిని అధిగమించేందుకు ఆయన కూడా వాస్తుని నమ్మడం మొదలుపెట్టిన్నట్లున్నారు. 

నూటికి నూరు శాతం వాస్తు ప్రకారం నిర్మించిన సచివాలయంలో వాస్తు నిపుణులు సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుతున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఛాంబర్ ఆరో అంతస్తులో ఉండగా రేవంత్‌ రెడ్డి జన్మనక్షత్రం ప్రకారం ఇప్పుడు 9వ అంతస్తులోకి మారబోతున్నారు. 

ఇప్పటి వరకు తూర్పుదిశలోని ప్రధాన ద్వారం గుండా ముఖ్యమంత్రి, మంత్రులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఇకపై పశ్చిమ ద్వారం గుండా లోనికి ప్రవేశించి ఈశాన్య ద్వారం గుండా బయటకు వెళుతుంటారు. ఐఏఎస్ అధికారులందరూ సచివాలయంలో ఆగ్నేయ ద్వారం గుండా రాకపోకలు సాగించబోతున్నారు. మరి ఈ వాస్తు మార్పులతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మేలు జరుగుతుందా లేదా? అనేది నేడు కౌంటింగ్‌ ముగిసేలోగా తేలిపోనుంది. 


Related Post