ఈ ఆర్ఆర్ఆర్‌ గ్రాఫిక్స్ కాదు సుమా!

May 29, 2024


img

రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్‌ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్‌ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌)లో మాత్రం అంతకు మించి అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రజలు చూడబోతున్నారు.

హైదరాబాద్‌ చుట్టూ ఇదివరకు నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్ ఎత్తు 11 అడుగుల మాత్రమే కానీ కొత్తగా నిర్మించబోతున్న ఆర్ఆర్ఆర్‌ ఏకంగా 18 అడుగులు ఎత్తులో ఉండబోతోంది. 

నగరం చుట్టు పక్కల జిల్లాలు, పట్టణాలు, గ్రామాల మీదుగా సాగే ఈ ఆర్ఆర్ఆర్‌ నిర్మించబోతున్నారు కనుక ఎక్కడికక్కడ అండర్‌పాస్‌లు నిర్మించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాలలో రాకపోకలు సాగించే వివిద వాహనాల ఎత్తుని బట్టి కొన్ని చోట్ల తక్కువ ఎత్తులో, కొన్ని చోట్ల ఎక్కువ ఎత్తులో అండర్‌పాస్‌లు నిర్మించాల్సి ఉంటుంది. వాటి కోసం ఆర్ఆర్ఆర్‌ ఎత్తు ఎక్కడికక్కడ మార్చుకుంటూ నిర్మిస్తే దానిపై వేగంగా ప్రయాణించే వాహనాలు ప్రమాధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. 

కనుక ఆర్ఆర్ఆర్‌ 158 కిమీ పొడవునా 18 అడుగుల ఎత్తులో నిర్మించాలనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం దీని కోసం భూసేకరణ ప్రక్రియ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్వాసితులకు చెల్లింపులు పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్‌ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. 

ఈ ఆర్ఆర్ఆర్‌లో మొత్తం 27 పెద్ద ఫ్లైఓవర్‌లు, 309 చిన్న ఫ్లైఓవర్‌లు, 187 అండర్‌పాస్‌లతో నిర్మించబోతున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల కోసం 11 ప్రాంతాలలో ఇంటర్ ఛేంజ్‌లు నిర్మించబోతున్నారు.


Related Post