ఇంత నీచ రాజకీయాలు అవసరమా?

May 23, 2024


img

తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తూ ఇంతవరకు ఉన్న టిఎస్‌కు బదులు టీజీని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ప్రభుత్వంలో అన్ని శాఖలు, అన్ని కార్యాలయాలు ఈ మార్పుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వాటిలో టిఎస్‌ఆర్టీసీ కూడా ఒకటి.

ప్రభుత్వం ఆదేశం మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో తన అధికారిక ఖాతాలకు టీఎస్ తొలగించి టీజీని పెట్టుకుని ఆ విషయం అందరికీ తెలియజేశారు. టిఎస్‌ఆర్టీసీలో టిఎస్‌ నుంచి టీజీకి మారేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కానీ మీడియాలో టిజీఎస్‌ఆర్టీసీ పేరుతో ప్రత్యక్షమైన లోగో నకిలీదని స్పష్టం చేశారు. టిజీఎస్‌ఆర్టీసీ లోగోని ఇంకా డిజైన్ చేయిస్తున్నామని చెప్పారు.

టిఎస్‌ఆర్టీసీ పేరుతో నకిలీ లోగోని రూపొందించి సోషల్ మీడియాలో పెట్టడాన్ని రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వపై బురద జల్లుతూ అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, అందుకు ఇదే తాజా ఉదాహరణ అని అన్నారు. ఇంత నీచ రాజకీయాలు అవసరమా?” అని ప్రశ్నించారు.

 <blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr"><a href="https://twitter.com/hashtag/TGSRTC?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#TGSRTC</a> కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… <a href="https://t.co/n2L0rezuoo">pic.twitter.com/n2L0rezuoo</a></p>&mdash; VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) <a href="https://twitter.com/tgsrtcmdoffice/status/1793494151025017201?ref_src=twsrc%5Etfw">May 23, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


Related Post