తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తూ గత ప్రభుత్వం ‘టిఎస్’ని ఎంచుకోగా ఆ రెండు అక్షరాలు టిఆర్ఎస్ పార్టీని సూచిస్తున్నట్లు ఉన్నాయని ఆనాడే రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. తాము అధికరంలోకి రాగానే ‘టిస్’ని ‘టిజి’ (తెలంగాణ గవర్నమెంట్)గా మారుస్తామని ఆనాడే చెప్పారు. చెప్పిన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ‘టిస్’ని ‘టిజి’గా మార్చుతూ నాలుగు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు ‘టిస్’ని ‘టిజి’గా మార్చుకోవాలని, ఉత్తర ప్రతుత్తరాలు, అధికారిక పత్రాలు, లెటర్ హెడ్స్, కంప్యూటర్లలోని సాఫ్ట్ కాపీలు, అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రతీచోట కూడా మార్చుకోవాలని ఆ ఉత్తర్వులలో సూచించింది. అలాగే టీఎస్‌ఆర్టీసీతో సహా కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్న అన్ని రకాల వాహనాలకు కూడా‘టిస్’ని ‘టిజి’ని కేటాయించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.
దీనిని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తక్షణమే తమ సంస్థలో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ పేరుని టిజిఎస్‌ఆర్టీసీగా, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను @tgsrtcmdoffice మరియు @tgsrtschq లుగా మార్చిన్నట్లు తెలియజేస్తూ ఇకపై వీటిని ఫాలో అవ్వాలని సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ముఖ్య గమనిక: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చడం జరిగింది. ఆ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చింది. మీ విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని… pic.twitter.com/vwwnklHttw
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 22, 2024