మళ్ళీ మోడీ ప్రభుత్వమే: ప్రశాంత్ కిషోర్‌

May 22, 2024


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్‌ ఇండియా టుడేకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడబోతోంది. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలలో 325 ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడ బీజేపీ, దాని మిత్రపక్షాలకు మంచి పట్టుంది. 

అలాగే తూర్పు, దక్షిణాది రాష్ట్రాలలో 225 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి బిహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో బీజేపీకి అదనంగా మరికొన్ని సీట్లు గెలుచుకోబోతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 

అయితే మోడీ పాలనపై ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ పూర్తి వ్యతిరేకత లేదు. ఈసారి తూర్పు, దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి అదనంగా కొన్ని సీట్లు లభించబోతున్నాయి 

గత లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎన్నికలలో 6-9 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. అలాగే ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుండటం వలన అక్కడ కూడా ఒకటి రెండు సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఆ రెండు పార్టీలు గెలుచుకోబోయే ఎంపీ సీట్లు కూడా బీజేపీ ఖాతాలోనే పడతాయని చెప్పారు. కనుక గత ఎన్నికలలో (303) కంటే కాస్త ఎక్కువే సీట్లే గెలుచుకుని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమే,” అని ప్రశాంత్ కిషోర్‌ అన్నారు.  



Related Post