కేంద్రంలోమళ్ళీ మోడీ, ఏపీలో చంద్రబాబు పక్కా!

May 21, 2024


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ జర్నలిస్ట్ బర్కాదత్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేంద్రంలో మళ్ళీ మోడీనాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందన్నారు. కానీ మోడీ, అమిత్ షాలు చెప్పుకుంటున్నట్లు 400 ఎంపీ సీట్లు రావని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తీరుపై ప్రజలలో కొంత అసంతృప్తిఉంది కానీ వ్యతిరేకత లేదని ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు.

ఏపీలో వైసీపి 151కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్‌రెడ్డి చెప్పుకోవడంపై కూడా ప్రశాంత్ కిషోర్‌ స్పందిస్తూ, “దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తాము ఎన్నికలలో ఓడిపోతామని చెప్పుకోదు. ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో వెనుకబడిపోయినా తదుపరి రౌండ్లలో మేమే ఆధిక్యం సాధించబోతున్నామనే చెప్పుకుంటాయి. జగన్మోహన్‌ రెడ్డి కూడా అలాగే చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి ఆయన ఓటమి ఖాయం.

ఒకవేళ ఆయన చెప్పుకున్నట్లు ఈ ఎన్నికలలో వైసీపి 151 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తే ఇలా మాట్లాడినందుకు అప్పుడు నేనే తల దించుకోవలసి వస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోతే అప్పుడు జగన్‌ తలదించుకోవలసి వస్తుంది. అనేక ఏళ్ళుగా ఎన్నికలను విశ్లేషిస్తున్న అనుభవంతో చెపుతున్నాను. కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకిరావడం ఖాయం. అలాగే ఏపీలో జగన్‌ ఓడిపోవడం ఖాయం,” అని ప్రశాంత్ కిషోర్‌ అన్నారు.


Related Post